logo

ఆస్తిపోయే.. ఆదరణ కరవాయె..!

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన వేముల అంజమ్మ భర్త చనిపోయారు. పోషించాల్సిన కుమారుడు కూడా సంవత్సరం కిందట మరణించాడు. దీంతో కోడలు, మనవళ్ల వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది.

Published : 24 May 2022 03:28 IST

ఈనాడు, అమరావతి: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన వేముల అంజమ్మ భర్త చనిపోయారు. పోషించాల్సిన కుమారుడు కూడా సంవత్సరం కిందట మరణించాడు. దీంతో కోడలు, మనవళ్ల వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది. తనభర్త, తాను కష్టపడి సంపాదించిన 6 ఎకరాల పొలాన్ని కుటుంబసభ్యులు వారి పేరుమీద రాయించుకుని, తర్వాత పట్టించుకోకుండా తినడానికి అన్నం కూడా పెట్టడం లేదని అంజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గతంలో బాపులపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తల్లిదండ్రుల, వృద్ధుల సంక్షేమ ట్రైబ్యునల్‌ ఆరా తీసింది. విచారణ నిమిత్తం సోమవారం ఆమె గుడివాడ ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. తన కుడికాలు విరిగితే రాడ్డు వేయించుకున్నానని.. ఎడమకాలుకూడా విరిగి నడవలేకున్నానని, ఆస్తి రాయించుకుని.. తనను ముప్పుతిప్పలు పెడుతున్నారని అంజమ్మ ఆర్డీఓకు మొరపెట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని