logo

దుర్గగుడిలో ముగ్గురికి పోస్టింగ్‌

రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై దుర్గగుడి ఎన్‌ఎంఆర్‌లు ముగ్గురికి దేవస్థానం ఈవో భ్రమరాంబ మంగళవారం పోస్టింగ్‌ ఇచ్చారు. దుర్గగుడిలో ఎన్‌ఎంఆర్‌లుగా 52 మంది గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు.

Published : 29 Jun 2022 04:51 IST

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై దుర్గగుడి ఎన్‌ఎంఆర్‌లు ముగ్గురికి దేవస్థానం ఈవో భ్రమరాంబ మంగళవారం పోస్టింగ్‌ ఇచ్చారు. దుర్గగుడిలో ఎన్‌ఎంఆర్‌లుగా 52 మంది గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో దేవస్థానం ఎన్‌ఎంఆర్‌లను రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చారు. అయినా కార్యరూపం దాల్చక పోవడంతో కొందరు ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వీరిని రెగ్యులరైజ్‌ చేయమని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను ఈవో దేవాదాయ శాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు విద్యార్హతలను అనుసరించి ఎన్‌.ఎం.ఆర్‌లు ఎ.కె.డి కృష్ణ, జయప్రకాష్‌లను రికార్డు అసిస్టెంట్లుగా, ప్రణీత్‌బాబును జూనియర్‌ అసిస్టెంట్‌గా నియమించినట్లు ఈవో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని