logo

కోర్టుకు హాజరు కాని అధికారులకు వారెంట్లు

సమన్లు అందుకుని కోర్టుకు హాజరుకాని అధికారులకు బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేస్తూ ఆరో అదనపు జిల్లాజడ్జి చినబాబు మంగళవారం ఆదేశాలిచ్చారు.

Published : 29 Jun 2022 04:51 IST

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: సమన్లు అందుకుని కోర్టుకు హాజరుకాని అధికారులకు బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేస్తూ ఆరో అదనపు జిల్లాజడ్జి చినబాబు మంగళవారం ఆదేశాలిచ్చారు. కృత్తివెన్ను మండలపరిధిలోని చినగొల్లపాలెం గ్రామంలో మే 13, 2017న జరిగిన వివాహిత మృతికేసుపై కోర్టులో విచారణ జరుగుతుంది. శవపంచనామా చేసిన అప్పటి కృత్తివెన్ను తహసీల్దారు భరత్‌రెడ్డి, దర్యాప్తుచేసిన ఎస్సై పి.లవరాజు, డీఎస్పీలు డి.సూర్యశ్రావణ్‌కుమార్‌, ఎండీ మెహబూబ్‌బాషాలను విచారణకు మంగళవారం హాజరుకావాలని ఈ నెల 22న కోర్టు సమన్లు జారీ చేసింది. వారు హాజరు కాకపోవడంతో ఆ నలుగురు అధికారులకు వారెంట్‌లు జారీ చేస్తూ న్యాయమూర్తి కేసును జులై 5వతేదీకి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని