logo

యానాది కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

ప్రతిపక్షనేతగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తక్షణం యానాది కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేలా సీఎం జగన్‌ చర్యలు తీసుకోవాలని యానాది సంక్షేమ సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం ధర్నా

Published : 10 Aug 2022 05:58 IST

ధర్నాచౌక్‌లో నిరసన తెలుపుతున్న సంఘ నాయకులు, కార్యకర్తలు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ప్రతిపక్షనేతగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తక్షణం యానాది కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేలా సీఎం జగన్‌ చర్యలు తీసుకోవాలని యానాది సంక్షేమ సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా విజయబాబు, తదితరులు మాట్లాడుతూ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బాపట్లకు వచ్చిన జగన్‌ యానాదుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నో చేస్తానంటూ చెప్పి, ముఖ్యమంత్రి అయ్యాక మర్చిపోవడం దురదృష్టకరమన్నారు.  బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.3 లక్షల వరకూ రుణాలు ఇప్పిస్తానన్న హామీ నేటికీ అమలుకు నోచుకోలేదని చెప్పారు. యానాది వర్గాలకు ఒక ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తామన్న మా సైతం నీటిమూట చందంగా మారిందన్నారు. చెప్పినవి చేయకుండా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేరుతో వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు. హామీలన్నీ అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. జిల్లా నాయకులు, యానాదులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని