logo

గ్యాస్‌ బండ... మరింత భద్రత

ఇటీవల జిల్లాలో వంట గదుల్లో గ్యాస్‌ సిలిండర్లు పేలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో వంట గదిలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గృహిణులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇండియన్‌ అయిల్‌ కార్పొరేషన్‌ పేలుడు రహిత కంపోజిట్‌

Published : 10 Aug 2022 05:58 IST

న్యూస్‌టుడే, తోట్లవల్లూరు: ఇటీవల జిల్లాలో వంట గదుల్లో గ్యాస్‌ సిలిండర్లు పేలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో వంట గదిలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గృహిణులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇండియన్‌ అయిల్‌ కార్పొరేషన్‌ పేలుడు రహిత కంపోజిట్‌ సిలిండర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 44 ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకుల్లో 25 ఏజెన్సీల్లో వీటిని అందుబాటులో ఉంచారు.

డిపాజిట్‌

పాత సిలిండరు 14.2 కిలోలు ఉంటాయి. కాంపొజిట్‌ సిలిండర్లలో 10 కిలోలు గ్యాస్‌ మాత్రమే నింపుతారు. కొత్త కనెక్షన్‌ కావాలంటే డిపాజిట్‌ రూ.3500 కంపెనీకి చెల్లించాలి. దీని ధర రూ.775. పాత సిలిండరు స్వాధీనం చేస్తే ఏజేన్సీలు పాత డిపాజిట్‌ పోను మిగిన సొమ్ము కట్టించుకుని కంపొజిట్‌ సిలిండర్లు ఇస్తారని ఏజెన్సీల డీలర్ల సంఘం అధ్యక్షుడు శంకరరావు తెలియజేశారు. కొండపల్లి ఐవోసీ బాటిలింగ్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌లో గ్యాస్‌ను ఫిల్లింగ్‌ చేసి ఏజెన్సీలకు సరఫరా చేస్తున్నారని వివరించారు.

ఇవీ ప్రత్యేకతలు...

* కంపోజిట్‌ సిలిండర్లు మూడు పొరలుగా తయారు చేశారు.

* గ్యాస్‌ పేలకుండా సమర్థంగా, తేలిగ్గా ఉంటుంది. బరువు తక్కువ.

* తుప్పు పట్టే అవకాశం ఉండదు. నేలపై మరకలు, గీతలు పడవు. గ్యాస్‌ ఎంతుందో కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. నిర్వహణ ఖర్చు తగ్గుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని