logo

‘గిరిజనుల సంక్షేమానికి పథకాల అమలు’

గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు పేర్కొన్నారు. అరండల్‌పేట అంబేడ్కర్‌ భవన్‌లో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

Published : 10 Aug 2022 05:58 IST

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు పేర్కొన్నారు. అరండల్‌పేట అంబేడ్కర్‌ భవన్‌లో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలలో ఒకరోజు ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహిస్తామని తెలిపారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌లు తొలి పోస్టింగ్‌ గిరిజన ప్రాంతాల్లో చేయాల్సి ఉంటుందన్నారు. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలుగుతుందన్నారు. జిల్లాలో ఎరుకలు, యానాదులు, చెంచులు, నక్కల తదితర తెగలకు చెందిన వారికి జగనన్న కాలనీల్లో పట్టాలు మంజూరు చేశామని తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలతో సమానంగా గిరిజనులను శక్తిమంతులుగా చేసేందుకు పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33,92,438 మంది గిరిజనులకు రూ.7.12కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని వివరించారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ షేక్‌ ఆసిఫ్‌, విశ్వబ్రహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ టి.శ్రీకాంత్‌, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి ఎం.రుక్మాంగదయ్య, గిరిజన తెగల నాయకులు పాల్గొన్నారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని