logo

నేటి నుంచి పలు రైళ్ల రద్దు.. దారి మళ్లింపు

రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే: గుంతకల్‌ డివిజన్‌లో నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల దృష్ట్యా పలు రైళ్ల రద్దు.. దారి మళ్లింపు చేపట్టినట్లు విజయవాడ రైల్వే అధికారులు గురువారం తెలిపారు.

Published : 12 Aug 2022 05:48 IST

రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే: గుంతకల్‌ డివిజన్‌లో నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల దృష్ట్యా పలు రైళ్ల రద్దు.. దారి మళ్లింపు చేపట్టినట్లు విజయవాడ రైల్వే అధికారులు గురువారం తెలిపారు.

* రైలు నంబరు 17215/17216 విజయవాడ-ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు గుత్తి-ధర్మవరం మధ్య తాత్కాలికంగా రద్దు.

* నంబరు 07693/07694 గుంతకల్‌-హిందూపురం డెము ప్యాసింజరు రైలు ఈ నెల 12 నుంచి 20వరకు పూర్తిగా రద్దు.

* రైలు నంబరు 07656/07655 తిరుపతి-గుంతకల్‌ ఈ నెల 12వ తేదీ నుంచి 19 వరకు ధర్మవరం-గుంతకల్‌ మధ్య రద్దు

* నంబరు 07589/07590 తిరుపతి-కందిరిదేవరపల్లి ఈ నెల 12 నుంచి 19వరకు రేణిగుంట, గుంతకల్‌ మీదుగా దారి మళ్లింపు.

* నంబరు 16339 ముంబయి-నాగర్‌కోయల్‌ ఈ నెల 16, 17 తేదీల్లో గుంతకల్‌, రేణిగుంట, తిరుపతి మీదుగా దారి మళ్లింపు.

* నంబరు 12766 అమరావతి-తిరుపతి ఈ నెల 15న గుత్తి, రేణిగుంట మీదుగా దారి మళ్లింపు.

* నంబరు 16340 నాగర్‌కోయల్‌-ముంబయి ఈ నెల 16,17 తేదీల్లో తిరుపతి, రేణిగుంట, గుంతకల్‌ మీదుగా మళ్లింపు.

* నంబరు 12765 తిరుపతి-అమరావతి ఈ నెల 16న రేణిగుంట, గుత్తి మీదుగా మళ్లింపు.

* రైలు నంబరు 12770 సికింద్రాబాద్‌-తిరుపతి ఈ నెల 16న గుత్తి, రేణిగుంట మీదుగా మళ్లింపు.

*  రైలు నంబరు 12732 సికింద్రాబాద్‌-తిరుపతి ఈ నెల 17న గుత్తి, రేణిగుంట మీదుగా మళ్లింపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని