logo

వరదపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

కృష్ణా నదిలో కొనసాగుతున్న వరదపై ముందు జాగ్రత్తతో వ్యవహరించాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులను  ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు.

Published : 13 Aug 2022 05:43 IST

కలెక్టరేట్‌(మచిలీపట్నం): కృష్ణా నదిలో కొనసాగుతున్న వరదపై ముందు జాగ్రత్తతో వ్యవహరించాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులను  ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు. ప్రకాశం బ్యారేజి నుంచి 4.45 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోందని, శుక్రవారం ఉదయం మొదటి హెచ్చరిక జారీ చేశామని చెప్పారు. నదిలో ఇన్‌ఫ్లో స్థిరంగా ఉందన్నారు. కట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో తగు రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నదిలో వరద నీరు తగ్గేవరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. అనంతరం జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలుపై తహసీల్దార్లు, సర్వేశాఖ అధికారులతో, రక్షిత మంచినీటి సరఫరాపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో వేర్వేరుగా సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని