logo

సైనికుల ధైర్యసాహసాలు ఎనలేనివి

 దేశ భద్రత కోసం మన సైనికులు, మాజీ సైనికులు చూపించిన ధైర్య సాహసాలు, తెగువ ఎనలేనివని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా సైనిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ సైనికులు ర్యాలీ నిర్వహించారు.

Published : 13 Aug 2022 05:43 IST


మహాత్మాగాంధీ రోడ్డులో భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన చేస్తున్న మాజీ సైనికులు, ఎన్‌సీసీ క్యాడెట్లు

విజయవాడ క్రీడలు, ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే :  దేశ భద్రత కోసం మన సైనికులు, మాజీ సైనికులు చూపించిన ధైర్య సాహసాలు, తెగువ ఎనలేనివని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా సైనిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ సైనికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి జాతీయ పతాకం, జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా డిల్లీరావు మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికుల సేవలు ఎంతో కీలకమని, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. మన సైన్యాన్ని చూసి ప్రపంచం మొత్తం గర్విస్తుందని చెప్పారు. తొలుత ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియం నుంచి జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారులు, సిబ్బంది, మాజీసైనికులు ర్యాలీ ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌కుమార్‌, రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ సంచాలకుడు బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి (రిటైర్డ్‌), ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ ఎం.బాలాజీ, సహాయ గణాంకాధికారి భక్తవత్సలరెడ్డి, ఎంప్లాయిమెంట్‌ అధికారి పి.రమేష్‌, ఉమ్మడి కృష్ణా జిల్లా సైనిక సంక్షేమాధికారిణి సర్జన్‌ లెఫ్టినెంట్‌ కమాండర్‌ కల్యాణ వీణ కె. (రిటైర్డ్‌), ఎన్టీఆర్‌ జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు శివనాగేశ్వరరావు, మాజీసైనికులు, కుటుంబ సభ్యులు,  ఎన్‌సీసీ కెడెట్లు పాల్గొన్నారు.


కలెక్టర్‌  డిల్లీరావుకు జ్ఞాపిక అందిస్తున్న బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి, కమాండర్‌ కల్యాణ వీణ తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని