logo

ఎన్ని పార్సిళ్లు వస్తున్నాయి.. ఆదాయం ఎలా ఉంది?

పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌ను అసోం ప్రభుత్వ అధికారులు పరిశీలించారు. అసోం రవాణా శాఖ కార్యదర్శి ఆదిల్‌ఖాన్‌, అసోం ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఎండీ రాహుల్‌ దాస్‌లు శుక్రవారం సాయంత్రం అరైవల్‌ బ్లాక్‌లోని కొరియర్‌, కార్గోకార్యాలయాన్ని పరిశీలించారు.

Published : 13 Aug 2022 05:43 IST

బస్టేషన్‌లో అసోం ప్రభుత్వ అధికారుల పరిశీలన


కార్గో కార్యాలయాన్ని పరిశీలిస్తున్న ఆదిల్‌ ఖాన్‌,  రాహుల్‌ దాస్‌, ఆర్‌ఎం వై.ఎం.దానం తదితరులు

విజయవాడ బస్టేషన్‌, న్యూస్‌టుడే: పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌ను అసోం ప్రభుత్వ అధికారులు పరిశీలించారు. అసోం రవాణా శాఖ కార్యదర్శి ఆదిల్‌ఖాన్‌, అసోం ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఎండీ రాహుల్‌ దాస్‌లు శుక్రవారం సాయంత్రం అరైవల్‌ బ్లాక్‌లోని కొరియర్‌, కార్గోకార్యాలయాన్ని పరిశీలించారు. ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులను అడిగి నిర్వహణ తీరును తెలుసుకున్నారు. కొరియర్‌ ఎలా చేస్తున్నారు, ఎన్ని పార్సిళ్లు బుకింగ్‌ చేస్తున్నారు, ఆదాయం ఎలా వస్తుంది, వస్తువులను వినియోదారుల వద్దకు ఏ విధంగా చేరవేస్తున్నారు, తదితర వివరాలను ఎన్టీఆర్‌ జిల్లా ప్రాంతీయ అధికారి వై.ఎం. దానంను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు బస్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు, సమాచార కేంద్రం, సిటీ బస్‌పోర్ట్‌లను కార్గో డెలివరీ పాయింట్‌లను చూశారు. కార్యక్రమంలో చీఫ్‌ సివిల్‌ ఇంజినీర్‌ యు.శ్రీనివాసరావు, డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌లు జాన్‌ సుధాకర్‌(జోన్‌), బషీర్‌ అహ్మద్‌(బస్టేషన్‌), ప్రధాన కార్యాలయం నుంచి శేషగిరిరావు, డి. ఆదినారాయణ తదితరులు    పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని