logo

వరద ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి: సీపీ

వరద ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని నగర పోలీస్‌కమిషనర్‌ కాంతిరాణా టాటా ఆదేశించారు.

Published : 13 Aug 2022 05:43 IST


కరకట్ట ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీపీ కాంతిరాణా, ఏసీపీ రవికిరణ్‌, సీఐ దుర్గారావు

కృష్ణలంక, న్యూస్‌టుడే: వరద ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని నగర పోలీస్‌కమిషనర్‌ కాంతిరాణా టాటా ఆదేశించారు. ఎగువ నుంచి పెద్ద మొత్తంలో వరద ప్రకాశం బ్యారేజీకి చేరుతున్నందున దిగువ ప్రాంతాలైన కృష్ణలంక, తారకరామానగర్‌ కరకట్ట ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ఆయా చోట్ల చేపట్టాల్సిన భద్రతాపరమైన ఏర్పాట్లపై అధికారులకు సూచనలిచ్చారు. సంబంధిత శాఖల సిబ్బందిని సమన్వయం చేసుకోవాలని చెప్పారు. సౌత్‌జోన్‌ ఏసీపీ డాక్టర్‌ రవికిరణ్‌, కృష్ణలంక సీఐ దుర్గారావు, సిబ్బంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని