logo

‘స్వాతంత్య్ర సంగ్రామంలో ఏఐఎస్‌ఎఫ్‌ కీలక భూమిక’

విద్యార్థులు, యువకులు రాజకీయాల్లోకి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడ దాసరి భవన్‌లో ఏఐఎస్‌ఎఫ్‌ 87వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు.

Published : 13 Aug 2022 05:43 IST


సంఘ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న రామకృష్ణ తదితరులు

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : విద్యార్థులు, యువకులు రాజకీయాల్లోకి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడ దాసరి భవన్‌లో ఏఐఎస్‌ఎఫ్‌ 87వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. నాయకులు పాతబస్టాండ్‌ నుంచి దాసరిభవన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సంగ్రామంలో ఏఐఎస్‌ఎఫ్‌ కీలక భూమిక పోషించిందన్నారు. నేటి భాజపా ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలను అవలంభిస్తుందని, మోదీ మతతత్వ విధానాలపై ప్రజలంతా తిరగబడాలని సూచించారు. అనంతరం ఏఐఎస్‌ఎఫ్‌ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి, సీపీఐ రాష్ట్ర కమిటీ నాయకులు అక్కినేని వనజ, సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ నాయకులు చందు, సుధీర్‌, రంజిత్‌, మధు, అయ్యప్ప, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని