logo

23న విద్యా సంస్థల బంద్‌

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య వేదిక నాయకులు వెల్లడించారు. శనివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య వేదిక(ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, పీడీఎస్‌ఓ, ఏఐఎస్‌ఏఏ) నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

Published : 14 Aug 2022 05:25 IST

విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య వేదిక నాయకులు వెల్లడించారు. శనివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య వేదిక(ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, పీడీఎస్‌ఓ, ఏఐఎస్‌ఏఏ) నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా సంఘాల నాయకులు ఎ.రవిచంద్ర, వి.శివారెడ్డి, ఎ.అశోక్‌ మాట్లాడుతూ.. విద్యా రంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫారమ్‌, జగనన్న విద్యా కానుక రాలేదని విమర్శించారు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు, పీజీ సెట్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రిఇంబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదలు చేయాలని కోరారు. బంద్‌ కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. గోడ పత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసన్నకుమార్‌, ఎం.సోమేశ్వరరావు, ఐ.రాజేష్‌, సాయి, ఇసాక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని