logo

మహిళ నుంచి బంగారు ఆభరణాల దోపిడీ

రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ వద్ద ఉన్న బంగారు ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లిన సంఘటన ఇది. గుడివాడ రైల్వే పోలీసుల కథనం ప్రకారం హైదరాబాదుకు చెందిన గొట్టుముక్కల రాధాకృష్ణ, రామ వాణిశ్రీ దంపతులు

Published : 17 Aug 2022 04:56 IST

రైలులో ఘటన


వాణిశ్రీ మెడపై గాయం

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ వద్ద ఉన్న బంగారు ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లిన సంఘటన ఇది. గుడివాడ రైల్వే పోలీసుల కథనం ప్రకారం హైదరాబాదుకు చెందిన గొట్టుముక్కల రాధాకృష్ణ, రామ వాణిశ్రీ దంపతులు విశాఖపట్నంలో పెళ్లికి వెళ్లడానికి సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లో లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. మంగళవారం ఉదయం గుడివాడ రైల్వే స్టేషన్‌ దాటి మోటూరు వద్దకు రైలు వస్తూ నిదానం అయ్యింది. అప్పటికే విజయవాడ నుంచి రాధాకృష్ణ దంపతులను అనుసరిస్తున్న ముఠా సభ్యులు ఒక్కసారిగా రామ వాణిశ్రీ మెడలో ఉన్న బ్యాగ్‌ను లాక్కొని రైలు దూకి పరారయ్యారు. ఆ బ్యాగులో సుమారు రూ.3 లక్షల విలువైన 45 గ్రాముల బంగారు సూత్రాల తాడు ఉంది. బాధితులు గుడివాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసి చేసేది లేక హైదరాబాదుకు వెనుదిరిగారు. రామ వాణిశ్రీ మెడకు గాయమైంది. ఈ మేరకు జీఆర్పీ ఎస్‌ఐ బి.వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని