logo

జాతిరత్నాలను అందించిన పెదకళ్లేపల్లి

భారతదేశానికి జాతిరత్నాలను అందించిన గడ్డ పెదకళ్లేపల్లి అని కలెక్టర్‌ రంజిత్‌ బాషా అన్నారు. ఎంతో మంది సంగీత, సాహిత్య, కళాభిమానులకు పుట్టినిల్లు ఈ గ్రామం అన్నారు. పెదకళ్లేపల్లిలో ఏర్పాటు చేసిన మువ్వన్నెల జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య

Published : 17 Aug 2022 04:56 IST

పింగళి విగ్రహావిష్కరణలో కలెక్టర్‌


వెంకయ్య విగ్రహావిష్కరణలో కలెక్టర్‌ రంజిత్‌ బాషా, ఎస్‌పీ జాషువా, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జేసీ, పింగళి వారసురాలు సుశీల తదితరులు

పెదకళ్లేపల్లి (మోపిదేవి), న్యూస్‌టుడే: భారతదేశానికి జాతిరత్నాలను అందించిన గడ్డ పెదకళ్లేపల్లి అని కలెక్టర్‌ రంజిత్‌ బాషా అన్నారు. ఎంతో మంది సంగీత, సాహిత్య, కళాభిమానులకు పుట్టినిల్లు ఈ గ్రామం అన్నారు. పెదకళ్లేపల్లిలో ఏర్పాటు చేసిన మువ్వన్నెల జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య నిలువెత్తు విగ్రహాన్ని మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ రంజిత్‌బాషా ఆవిష్కరించారు. రూ.60వేల విలువగల ఈ విగ్రహాన్ని పండలనేని పెదభాస్కరరావు పేరిట వారి కుమారులు శివప్రసాద్‌, ప్రకాశరావు, ఏసుబాబు వితరణగా అందించారు. ప్రేమతో పెదకళ్లేపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు గంధం వీరాంజనేయులు, ఉపాధ్యక్షులు తలుపుల అనితానాయుడు, బండారు మధుబాబు, కార్యదర్శి అక్కాపంతుల నరసింహశర్మ, కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఎన్‌సీసీ క్యాడెడ్లు జాతీయ పతాకంతో కవాతు చేశారు. సర్పంచి అరజా సంధ్యారాణి అధ్యక్షతవహించారు. ఎస్‌పీ జాషువా, జేసీ మహేశ్‌కుమార్‌, శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబు, ఎంపీపీ దుర్గావాణి, పింగళి వారసురాలైన సుశీల దశరధరామ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా తపాలా శాఖ ముద్రించిన కవరు, స్టాంపులను అవనిగడ్డ పోస్టుమాస్టర్‌ సింహాద్రి రామలింగేశ్వరరావుద్వారా కలెక్టర్‌ విడుదల చేశారు. విగ్రహ దాతలను, పింగళి వారసురాలు సుశీలను సన్మానించి జ్ఞాపికలు అందించారు. అనంతరం దుర్గాపార్వతీ సమేత నాగేశ్వరస్వామిని దర్శించి పూజలు చేశారు. ఉప ఎంపీపీ సీతారామాంజనేయులు, జడ్పీటీసీ సభ్యులు మల్లికార్జునరావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

విగ్రహదాతను సత్కరిస్తున్న ఆహ్వానితులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని