logo

మీలో ఎవరు పెళ్లి కొడుకు?ఒక్కరూ అలా లేరే!: కంకిపాడులో పోలీసుల అడ్డగింత

కంకిపాడు సమీప దావులూరు టోల్‌గేట్‌ వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలీసుల హడావుడి కనిపించింది. ‘అనుమానిత’ వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఆధార్‌ తదితర గుర్తింపు కార్డుల కోసం డిమాండ్‌ చేశారు.

Updated : 25 Sep 2022 07:06 IST

పిడుగురాళ్లకు చెందిన వ్యక్తులు, పోలీసుల మధ్య వాగ్వాదం

కంకిపాడు, న్యూస్‌టుడే: కంకిపాడు సమీప దావులూరు టోల్‌గేట్‌ వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలీసుల హడావుడి కనిపించింది. ‘అనుమానిత’ వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఆధార్‌ తదితర గుర్తింపు కార్డుల కోసం డిమాండ్‌ చేశారు. ఇవి లేకుంటే ముందుకు పంపేదిలేదంటూ..వాగ్వాదానికి దిగిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వీటిలో భాగంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి కారులో ఆరుగురు వ్యక్తులు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికి, ఎందుకు వెళుతున్నారు.. ఆధార్‌ కార్డులు చూపించాలని ఆదేశించారు. దీనికి వారు ‘మేం తీవ్రవాదులమా? పాకిస్థాన్‌ నుంచి వచ్చామా? ఆధార్‌ కార్డులు జేబులో పెట్టుకు తిరగాలా? మిగతా వాహనాలు ఎందుకు వదిలేస్తున్నారు? మేం భీమవరం సమీప గ్రామానికి పెళ్లి చూపులకు వెళుతున్నాం’ అంటూ పోలీసులను ప్రశ్నించారు. ‘గుర్తింపు కార్డులు చూపించడంలేదంటే..మిమ్మల్ని అనుమానించాల్సి వస్తోంది.. మీలో పెళ్లి కొడుకు ఎవరు? ఒక్కరు కూడా అలా కనబడడం లేదు? పెళ్లికూతురు కుటుంబీకులతో ఫోనులో మాట్లాడించండి.. మా ఇష్టం వచ్చిన వాహనాలను తనిఖీ చేసే అధికారం మాకుంది.. మాట్లాడకుండా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లండి’ అంటూ వాహనాన్ని ఎక్కించి తరలించారు. చేసేదిలేక వారంతా స్టేషన్‌కు వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని