logo

Vijayawada: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా..

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు, నగర ప్రజలు, విజయవాడ మీదుగా ప్రయాణించే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ, మధ్య తరహా వాహనాలు

Updated : 25 Sep 2022 09:30 IST

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు, నగర ప్రజలు, విజయవాడ మీదుగా ప్రయాణించే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ, మధ్య తరహా వాహనాలు మళ్లిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ రాత్రి నుంచి అక్టోబరు 5వ తేదీ రాత్రి వరకు వాహనాలు మళ్లిస్తున్నట్లు తెలిపారు. 

వివరాలు ఇలా..

హైదరాబాద్‌-విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను ఇబ్రహీంపట్నం వద్ద నుంచి జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్‌ మీదుగా మళ్లిస్తారు. (ఇరువైపులా).

విశాఖపట్నం-చెన్నై వైపు వెళ్లే వాహనాలను హనుమాన్‌జంక్షన్‌ బైపాస్‌ మీదుగా గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మీదుగా మళ్లిస్తారు. (ఇరువైపులా).

గుంటూరు-విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు కూడలి, పెనమూడి వారధి మీదుగా అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లిస్తారు. (ఇరువైపులా).

చెన్నై-హైదరాబాద్‌ రాకపోకలు సాగించే వాహనాలను మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌ వెళ్లాలి. (ఇరువైపులా).

ఆర్టీసీ బస్సులు..

విజయవాడ నుంచి హైదరాబాద్, జగ్గయ్యపేట, తిరువూరు వైపు వెళ్లు బస్సులను... పండిట్‌ నెహ్రూ బస్టేషన్, కనకదుర్గా పైవంతెన, స్వాతి కూడలి, గొల్లపూడి వై కూడలి, ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లిస్తారు. (ఇరువైపులా).

విజయవాడ సిటీ బస్టాప్‌ నుంచి విద్యాధరపురం, పాల ప్రాజెక్టు మధ్య నడిచే ఆర్టీసీ బస్సులను పండిట్‌ నెహ్రూ బస్టేషన్, పాత పోలీస్‌ కంట్రోల్‌రూం, గద్ద బొమ్మ కూడలి, కాళేశ్వరరావుమార్కెట్, పంజా సెంటరు, వీజీ చౌక్, చిట్టినగర్‌ మీదుగా పంపిస్తారు. 

మూలా నక్షత్రం రోజున (అక్టోబరు 1 రాత్రి నుంచి అక్టోబరు 2 రాత్రి వరకు)

ఆర్టీసీ, సిటీ బస్సులను కనకదుర్గా పై వంతెన, కాళేశ్వరరావు మార్కెట్‌ వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలు పీఎన్‌బీఎస్, పాత పీసీఆర్, చల్లపల్లి బంగ్లా కూడలి, ఏలూరు లాకులు, బుడమేరు వంతెన, పైపులరోడ్డు, వై.వి.రావు ఎస్టేట్, సీవీఆర్‌ పై వంతెన, సితార, గొల్లపూడి వై కూడలి, ఇబ్రహీంపట్నం మీదుగా పంపిస్తారు. (ఇరువైపులా).

మూలా నక్షత్రం రోజున ప్రకాశం బ్యారేజీపై ఏ విధమైన వాహనాలను అనుమతించరు.

నగరంలో తిరిగే వాహనదారులు కనకదుర్గ పై వంతెన మీద నుంచి లేదా చిట్టినగర్‌ సొరంగం నుంచి భవానీపురం వైపు వెళ్లాలి. (ఇరువైపులా).

కుమ్మరిపాలెం నుంచి ఘాట్‌ రోడ్డు, ఘాట్‌ రోడ్డు నుంచి కుమ్మరిపాలెం వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు. 

పార్కింగ్‌ ప్రదేశాలు

ఏ వాహనాలు? ఎక్కడెక్కడంటే..

ద్విచక్రవాహనాలు : పద్మావతి ఘాట్, ఇరిగేషన్‌ పార్కింగ్, గద్దబొమ్మ పార్కింగ్, లోటస్‌ అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌.

కార్లు : రాజీవ్‌గాంధీ పార్కు పక్క రోడ్డు, కాళేశ్వరరావు మార్కెట్‌ సెల్లార్‌ పార్కింగ్, గాంధీజీ మున్సిపల్‌ హైస్కూల్, తితిదే పార్కింగ్‌ కుమ్మరిపాలెం.
బస్సులు : పున్నమి ఘాట్, భవానీ ఘాట్, సుబ్బారాయుడికి చెందిన ఖాళీస్థలం, పాత సోమా కంపెనీ స్థలం, సితార కూడలి.

టూరిస్ట్‌ బస్సులకు..

హైదరాబాద్‌ నుంచి వచ్చే టూరిస్ట్‌ బస్సులు పున్నమిఘాట్‌ లేదా భవానీ ఘాట్‌లో.

విశాఖపట్నం నుంచి వచ్చే టూరిస్ట్‌ బస్సులు.. ఆర్టీసీ వర్క్‌షాపు వద్ద ఉన్న సోమా కంపెనీ స్థలంలో.

గుంటూరు వైపు నుంచి వచ్చే బస్సులు భవానీపురం దర్గా ఎదురుగా ఉన్న సుబ్బారాయుడి స్థలంలో నిలపాలి.

భక్తులు తిరిగి వెళ్లే సమయంలో పార్కింగ్‌ చేసిన ప్రదేశం వద్దనే బస్సు ఎక్కాలి. వారు వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లాలని పోలీస్‌ కమిషనర్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు