logo

స్వర్ణకవచాలంకృతా పాహిమాం

విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. అష్టభుజాలతో సింహాసనంపై కూర్చుని, త్రిశూలధారిగా బంగారు ధగధగలతో మెరుస్తున్న జగన్మాతను భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి సుప్రభాత సేవ,

Updated : 27 Sep 2022 05:41 IST

ఘనంగా ప్రారంభమైన దసరా వేడుకలు

ఈనాడు, అమరావతి

అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొస్తున్న పండితులు, ఈవో భ్రమరాంబ తదితరులు

విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. అష్టభుజాలతో సింహాసనంపై కూర్చుని, త్రిశూలధారిగా బంగారు ధగధగలతో మెరుస్తున్న జగన్మాతను భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, బాలభోగనివేదన, నిత్యార్చన పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఉదయం 9.30 నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. మొదటి రోజు భక్తుల రద్దీ తక్కుగానే ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు 30వేల మంది వరకూ భక్తులు దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రాత్రి వరకూ మరో 20వేల మంది వరకూ దర్శించుకున్నారు. మొత్తం మొదటి రోజు 50వేల మంది వరకు భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి క్యూలైన్లు ఖాళీగానే దర్శనం ఇచ్చాయి. దర్శనాలు రాత్రి 11గంటల వరకు కొనసాగాయి.  దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా దంపతులు, కలెక్టర్‌ ఢిల్లీరావు, జేసీ నుపూర్‌ అజయ్‌కుమార్‌ తదితర ప్రముఖులు కూడా మొదటి రోజు దర్శనాలకు వచ్చారు. రెండో రోజు నుంచి ఉదయం 4గంటలకే భక్తులను అమ్మవారి దర్శనాలకు అనుమతిస్తారు.

హారతి అందుకుంటున్న భక్తులు

నేడు బాలా త్రిపురసుందరీదేవి రూపం..

ఉత్సవాలలో రెండో రోజు మంగళవారం దుర్గమ్మ బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనం ఇవ్వనుంది. బాలా త్రిపురసుందరీదేవిని దర్శించుకుంటే పూర్ణఫలం దక్కుతుందనేది భక్తుల విశ్వాసం. బాలాదేవి మహిమాన్వితమైనది. బాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి గొప్పది. ముఖ్యమైనది. అందుకే విద్యోపాసనకు మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపురసుందరీదేవి నిత్యం కొలువ ఉండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే దేవత శ్రీబాలాత్రిపుర సుందరీదేవి. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలరని భక్తుల నమ్మకం. అందుకే ఏటా దసరాలో భారీగా తరలివచ్చి బాలాత్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటారు.

దర్శనం చేసుకొని కొండ దిగి వస్తున్న జనం

కనకదుర్గాదేవికి వేద పండితుల పూజలు

అలరించిన కేరళ డప్పు వాయిద్యం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని