logo

అందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌కార్డులు: కలెక్టర్‌

ప్రతి ఒక్కరికి ఆధార్‌ కార్డులు జారీ చేసిన విధంగా ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా హెల్త్‌కార్డులు అందజేస్తారని కలెక్టర్‌ రంజిత్‌బాషా చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేమయ్యారు. ఈ సందర్భంగా

Published : 27 Sep 2022 05:33 IST

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న రంజిత్‌బాషా, జేసీ మహేష్‌కుమార్‌, ఇతర అధికారులు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరికి ఆధార్‌ కార్డులు జారీ చేసిన విధంగా ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా హెల్త్‌కార్డులు అందజేస్తారని కలెక్టర్‌ రంజిత్‌బాషా చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పందన అర్జీల పరిష్కారాలకు సంబంధించి అప్‌లోడ్‌ చేయాల్సిన ఫొటోలు 32 పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గుడివాడలో టిడ్కో గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ఇప్పటివరకూ 1,616 రిజిస్ట్రేషన్‌లు నిర్వహించారని, వాటిని వేగవంతం చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల కోసం అదనంగా స్కానర్లు, ప్రింటర్ల అవసరం ఉందని జిల్లా రిజిస్ట్రార్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకురావడంతో తగు చర్యలు తీసుకోవాల్సిందిగా టిడ్కో, మున్సిపల్‌ అధికారులకు సూచించారు.

ప్రతి సచివాలయంలో ఆధార్‌కేంద్రం.. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాలను ఆధార్‌ కేంద్రాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని కలెక్టర్‌ తెలిపారు. మంగళ, బుధ వారాల్లో రెండు రోజుల పాటు అన్ని సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఆధార్‌కార్డు తరహాలో ప్రతి పౌరునికి యూనిక్‌ హెల్త్‌ ఐడీతో కూడిన హెల్త్‌కార్డు పంపిణీ మంగళవారం నుంచి చేపడతారన్నారు. ఆప్కో ద్వారా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన స్టాల్‌ను కలెక్టర్‌, జేసీ మహేష్‌కుమార్‌ ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు.

బీచ్‌ పరిశుభ్రతలో పాల్గొనండి.. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ మంగినపూడి బీచ్‌ పరిశుభ్రతా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు అందరూ వారి కుటుంబసభ్యులతో పాల్గొనాలని కలెక్టర్‌ కోరారు.

* గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమంలో గుర్తించిన పనులకు సంబందింÅచి ప్రాధాన్యతా క్రమంలో అంచనాలు సమర్పించాలని కలెక్టర్‌ అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన మండలాల వారీ సమీక్ష  నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో సీపీవో వై.శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.

అర్జీలు ఇవీ..

* విమానాశ్రయ విస్తరణ నిమిత్తం తీసుకున్న భూములకు ఏడు ఏళ్లు గడుస్తున్నా నష్టపరిహారం ఇవ్వలేదని, తగు చర్యలు తీసుకోవాలని బుద్ధవరం గ్రామానికి చెందిన రైతులు కోరారు.

* జగనన్న కాలనీ నిర్మాణాల కోసం అవసరమైన అన్ని వసతులు ఉన్న భూములను గతంలో ప్రభుత్వం ఇచ్చిన పారితోషికం కన్నా రూ.2.00 లక్షలు తగ్గించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కొనుగోలు విషయంలో అక్రమాలు లేకుండా చూడాలని పామర్రు గ్రామానికి చెందిన పలువురు రైతులు వినతిపత్రం అందచేశారు.

* గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టులకు గతంలో వలే పారదర్శకంగా పరీక్షా ఫలితాలు ప్రకటించాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పద్మకుమారి, రమాదేవి తదితరులు అర్జీ సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని