logo

ట్యాంకర్లలో పెట్రోలు మాయం

ట్యాంకర్ల ద్వారా పెట్రోల్‌ బంకుకు ఆయిల్‌ తీసుకువస్తున్న వ్యవహారంలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు చేసిన తనిఖీల్లో ఈ విషయం వాస్తవమేనని గుర్తించారు. వివరాల్లోకి వెళితే గత శనివారం సీతనపల్లి బంకుకు 12వేల లీటర్లతో ట్యాంకర్‌ వచ్చింది. అనుమానం వచ్చిన  బంకు యజమాని

Updated : 27 Sep 2022 05:43 IST

తనిఖీలు చేసిన అధికారులు

సీతనపల్లి పెట్రోల్‌ బంకు వద్ద సమస్యకు కారణమైన ఆయిల్‌ ట్యాంకర్‌

సీతనపల్లి(కృత్తివెన్ను), న్యూస్‌టుడే: ట్యాంకర్ల ద్వారా పెట్రోల్‌ బంకుకు ఆయిల్‌ తీసుకువస్తున్న వ్యవహారంలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు చేసిన తనిఖీల్లో ఈ విషయం వాస్తవమేనని గుర్తించారు. వివరాల్లోకి వెళితే గత శనివారం సీతనపల్లి బంకుకు 12వేల లీటర్లతో ట్యాంకర్‌ వచ్చింది. అనుమానం వచ్చిన  బంకు యజమాని ఆయిల్‌ దిగుమతి చేసుకొనే ముందు మధ్యలో ఉన్న ట్యాంకు నుంచి సుమారు 500 లీటర్ల అయిల్‌ను తీయించారు. ట్యాంక్‌ ఇంకా నిండుగా ఉన్నట్లు కొలతలో చూపిస్తుంది. ఈ విషయమై ట్యాంకర్‌ డ్రైవర్‌ను నిలదీయగా అతను అక్కడ నుంచి పారిపోయినట్లు చెప్పారు. దీంతో 12వేల లీటర్లకుగాను 500లీటర్ల ఆయిల్‌ ప్రతిసారి తక్కువగా వస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా యూనియన్‌ సభ్యులకు తెలపగా జిల్లా వ్యాప్తంగా 40మంది పెట్రోల్‌ బంకులు డీలర్లు సోమవారం ఉదయం వచ్చి పరిశీలించారు. కృత్తివెన్ను మండలం తహసీల్దార్‌కి ఫిర్యాదు చేయగా సాయంత్రం వరకు రాలేదు.దీంతో డీఎస్‌వోకు సమ్మెకు దిగుతున్నట్లు తెలపడంతో రాత్రి 7గంటలకు సివిల్‌సప్లై డీటీ హేమంత్‌, తూనికలు, కొలతల అధికారులు, అసిస్టెంట్‌ కంట్రోల్‌ లీగల్‌ అధికారులు టి.రాజేంద్రప్రసాద్‌లు, నందిగామ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ భానుప్రసాద్‌ విజయవాడనుంచి వచ్చి రాత్రి 10గంటలకు వరకు తనిఖీలు నిర్వహించారు.అందరి సమక్షంలో మధ్యలో ఉన్న ట్యాంకునుంచి 100లీటర్ల ఆయిల్‌ తీసినా, ఇంకా డిప్‌ పరిమాణం తగ్గలేదు. దీంతో ట్యాంకులో ఉన్న మొత్తం తీసిచూడగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డిప్‌ను సూచించే స్కేలు రాడ్డుకు, మధ్యలో మరోరాడ్డు అమర్చడంతో రీడింగు తగ్గుదల చూపడం లేదని నిర్ధారించారు. దీనికి కారణమైన రవాణా ట్యాంకర్లు సరఫరా చేస్తున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నివేదిక తయారు చేసి, ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. కార్యక్రమంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ టర్మినల్‌ ఛీఫ్‌ మేనేజర్‌ ఆనందసాగర్‌, బంకు డీలర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని