logo

Vijayawada: విజయవాడలో గంజాయి బ్యాచ్‌ సభ్యుల వీరంగం

స్థానిక ఐలాపురం హోటల్‌ సెంటర్‌లో సోమవారం రాత్రి గంజాయి బ్యాచ్‌ సభ్యులు వీరంగం సృష్టించడంతో స్థానికులు, వ్యాపారులు భయభ్రాంతులకు గురయ్యారు. 

Updated : 27 Sep 2022 09:11 IST

రోడ్డుపై కొట్టుకుంటున్న గంజాయి బ్యాచ్‌ సభ్యులు

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: విజయవాడలోని స్థానిక ఐలాపురం హోటల్‌ సెంటర్‌లో సోమవారం రాత్రి గంజాయి బ్యాచ్‌ సభ్యులు వీరంగం సృష్టించడంతో స్థానికులు, వ్యాపారులు భయభ్రాంతులకు గురయ్యారు. చిత్తుకాగితాలు ఏరుకునే ఎన్‌.రాఘవ, వెంకటరత్నంల మధ్య మాటా మాటా పెరిగి రోడ్డుమీద గంజాయి మత్తులో కర్రలతో కొట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వాహనచోదకులు భయాందోళనతో పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సత్యనారాయణపురం పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సాంబమూర్తి రోడ్డులో బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి బ్యాచ్‌ సభ్యుల అరాచకాలు ఎక్కువగా ఉంటున్నాయని ప్రతి రోజూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో రాత్రి సమయంలో పోలీసు నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని