logo

ఐసీడీఎస్‌ పర్యవేక్షకుల పరీక్షల్లో గందరగోళం

అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి ఐసీడీఎస్‌ రెండో శ్రేణి పర్యవేక్షక (గ్రేడ్‌-2 సూపర్‌వైజర్లు) ఉద్యోగాల భర్తీకి ఈ నెల 18న పరీక్షలు నిర్వహించి, ఇంత వరకు ‘కీ’ విడుదల చేయకపోగా, ఫలితాలను కూడా ప్రకటించలేదని.. సీఐటీయూ అనుబంధ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌

Published : 27 Sep 2022 05:33 IST

ఫలితాలు ప్రకటించకుండానే పిలుపులు

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి ఐసీడీఎస్‌ రెండో శ్రేణి పర్యవేక్షక (గ్రేడ్‌-2 సూపర్‌వైజర్లు) ఉద్యోగాల భర్తీకి ఈ నెల 18న పరీక్షలు నిర్వహించి, ఇంత వరకు ‘కీ’ విడుదల చేయకపోగా, ఫలితాలను కూడా ప్రకటించలేదని.. సీఐటీయూ అనుబంధ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి,  ఎన్టీఆర్‌ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్‌.సి.హెచ్‌.సుప్రజ తదితరులు సోమవారం కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు దృష్టికి తెచ్చారు. పరీక్షలు రాసిన కొద్ది మందికి ఆంగ్లంలో మాట్లాడుతూ.. వీడియోలు పంపాలని ఈ నెల 25న అకస్మాతుగా సీడీపీవోలు తెలియజేసినట్లు చెప్పారు. దీని వల్ల సదరు ఉద్యోగాలకు పరీక్షలను రాసిన వారిలో అనుమానాలు కలుగులుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు కలెక్టరు కార్యాలయం వద్ద వినతి పత్రం సమర్పించారు. వందలాది మంది పరీక్షలు రాయగా, ఫలితాలను ప్రకటించకుండా కొంత మందికి మాత్రమే వీడియోలు పంపాలని పిలుపులు రావడం శోచనీయమన్నారు. పారదర్శకంగా ఫలితాలను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పరీక్ష కీ విడుదల చేయాలని, ప్రతి ఒక్కరికీ ఎన్ని మార్కులు వచ్చాయో ఫలితాలను ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు. ఆ తరువాత మాత్రమే మెరిట్‌ ఆధారంగా వీడియోలు తీసి ఫైనల్‌ లిస్టు ప్రకటించాలన్నారు. పర్యవేక్షకుల ఉద్యోగాల భర్తీలో రోస్టర్‌ పద్దతి పాటించాలన్నారు. సీఐటీయూ ఎన్టీఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, గజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని