logo

Addanki: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పేరిట యువతికి రూ.17 లక్షలకు టోకరా

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రారంభిస్తున్నా.. అందులో నీకు ఉద్యోగం ఇస్తా.. నా సోదరిలా భావిస్తున్నా.. అంటూ మొదట కొద్ది మొత్తాన్ని తీసుకుంటూ తిరిగి చెల్లిస్తున్న వ్యక్తి.. 

Updated : 27 Sep 2022 09:23 IST

అద్దంకి, న్యూస్‌టుడే : సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రారంభిస్తున్నా.. అందులో నీకు ఉద్యోగం ఇస్తా.. నా సోదరిలా భావిస్తున్నా.. అంటూ మొదట కొద్ది మొత్తాన్ని తీసుకుంటూ తిరిగి చెల్లిస్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా రూ.17 లక్షలు అతని ఖాతాకు బదిలీ చేయించుకుని.. తర్వాత మొబైల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. మోసపోయానని తెలుసుకున్న యువతి అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అద్దంకి ఎస్సై ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి వివరాల మేరకు.. కృష్ణా జిల్లా మువ్వ మండలం కూచిపూడికి చెందిన లింగమనేని దివ్య బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా రెండేళ్ల నుంచి పని చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 12న మరో సంస్థలో ఉద్యోగానికి ఆమె దరఖాస్తు చేసింది. దరఖాస్తులోని వివరాలు తెలుసుకున్న అద్దంకి మండలం కొటికలపూడికి చెందిన పూనాటి శ్రీనివాస్‌ కిరణ్‌బాబు పేరు మార్చి చరవాణి, అంతర్జాలం ద్వారా పరిచయం ఆమెతో పెంచుకున్నాడు. పిన్నమనేని సాయి కార్తీక్‌బాబుగా పేరు చెప్పి తాను సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రారంభిస్తున్నట్లు నమ్మించాడు. దీనికి కొంత నగదు అవసరమని చెబుతూ కనిష్ఠంగా రూ.5 వేలు, గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు ఆమె నుంచి తీసుకుని తిరిగి చెల్లించాడు. అతని మాటల్ని ఆమె నమ్మింది.

అత్యవసర పనుల నిమిత్తం అవసరమంటూ జూన్‌ 3న రూ.10 లక్షలు, తర్వాత రూ.3 లక్షలు, రూ.4 లక్షలు తన ఖాతాకు జమ చేయించుకున్నాడు. వెరసి రూ.17 లక్షలు ఆమె నుంచి తీసుకున్న తర్వాత చరవాణి స్విఛాప్‌ చేశాడు. యువతి అప్పు చేసి అతనికి నగదు ఇచ్చింది. మోసపోయానని గ్రహించి ఆమె అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని