logo

సర్కార్‌ కొలువంటూ మోసం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ యువకుడిని నమ్మించి మోసం చేసిన ప్రైవేటు సంస్థ నిర్వాహకులపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. శీలం అనిల్‌రెడ్డి ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం సీతానాగులవరం నివాసి. ఇతనికి కానూరు అశోక్‌నగర్‌లోని వెలోవే ఎన్విరాన్‌మెంటల్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థను నిర్వహించే మాచర్ల ఆనంద్‌సాగర్‌  అనే వ్యక్తి కొంతకాలం క్రితం పరిచయమయ్యాడు.

Published : 27 Sep 2022 05:33 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ యువకుడిని నమ్మించి మోసం చేసిన ప్రైవేటు సంస్థ నిర్వాహకులపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. శీలం అనిల్‌రెడ్డి ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం సీతానాగులవరం నివాసి. ఇతనికి కానూరు అశోక్‌నగర్‌లోని వెలోవే ఎన్విరాన్‌మెంటల్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థను నిర్వహించే మాచర్ల ఆనంద్‌సాగర్‌  అనే వ్యక్తి కొంతకాలం క్రితం పరిచయమయ్యాడు. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం ఇప్పిస్తానని, దీనికి రూ.7.50 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని అనిల్‌రెడ్డిని నమ్మించాడు. దీనికి అంగీకరించిన అనిల్‌రెడ్డి దఫాల వారీగా ఈ మొత్తాన్ని ఆనంద్‌సాగర్‌కు అందజేశాడు. అనంతరం ఆనంద్‌సాగర్‌ కొద్దిరోజుల తర్వాత అనిల్‌రెడ్డిని కర్ణాటకలోని ధార్వాడలో ఎస్‌జీఎస్‌ఎస్‌ హెఆర్‌ కన్సల్టెన్సీలో ఉద్యోగంలో చేర్చాడు. ఈ సంస్థలో ఒక నెల జీతం చెల్లించి తర్వాత నుంచి చెల్లించకపోవడడం, ఇదే సంస్థపై పలువురు బాధితులు కేసులు పెట్టడంతో తాను కూడా మోసపోయినట్లు గుర్తించిన అనిల్‌రెడ్డి సోమవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఎన్విరాన్‌మెంటల్‌ సొల్యూషన్స్‌ సంస్థ నిర్వాహకుడు మాచర్ల ఆనంద్‌సాగర్‌, ఉద్యోగులు మాచర్ల రామయ్య, భారతి, ధనలక్ష్మి, లక్ష్మిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని