logo

సాగునీరు కృష్ణార్పణం

దివిసీమలోని వ్యవసాయ క్షేత్రాలకు వినియోగపడే సాగునీటిని పులిగడ్డలోని అక్విడెక్టుకు ఉన్న రెండు అండర్‌ టన్నెల్స్‌ నుంచి కృష్ణానదిలోకి అధికారులు శనివారం విడుదల చేయడం ద్వారా కృష్ణార్పణం చేస్తున్నారు.

Published : 02 Oct 2022 04:06 IST

అక్విడెక్టు అండర్‌ టన్నెల్‌ నుంచి కృష్ణా నదిలోకి విడుదల చేసిన సాగునీరు

అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: దివిసీమలోని వ్యవసాయ క్షేత్రాలకు వినియోగపడే సాగునీటిని పులిగడ్డలోని అక్విడెక్టుకు ఉన్న రెండు అండర్‌ టన్నెల్స్‌ నుంచి కృష్ణానదిలోకి అధికారులు శనివారం విడుదల చేయడం ద్వారా కృష్ణార్పణం చేస్తున్నారు. నాగాయలంక మండలంలోని తలగడదీవి ఆయకట్టు, కమ్మనమోలులోని 3ఎ కాల్వలకు సాగునీరు సరఫరా లేదని రైతులు ఇటీవల ఆందోళన చేశారు. తలగడదీవి ఆయకట్టు ప్రాంతంలో వేసిన వరి పంట నీరు లేక బీటలు వారిందని జలవనరులశాఖ సబ్‌ డివిజన్‌ డీఈఈ రవికిరణ్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయన స్పందించి నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు. పంట కాల్వలకు పూర్తిస్థాయిలో సాగునీరు విడుదల చేయకుండా కృష్ణానదిలోకి వదిలివేయడమేమిటని దివి రైతులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని