logo

దారి లేక.. పింఛన్లకు నోచుకోక

వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పింఛన్లు అందిస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రగల్బాలు పలకడమేగానీ క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 02 Oct 2022 04:06 IST

పాత ఎడ్లంకలో పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు

పాతఎడ్లంక(అవనిగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పింఛన్లు అందిస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రగల్బాలు పలకడమేగానీ క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అవనిగడ్డ మండలం పాత ఎడ్లంకలో శనివారం పింఛన్ల కోసం లబ్ధిదారులు పడిగాపులు పడ్డారు. వాలంటీరు లేకపోవడంతో నాలుగు కిలోమీటర్ల దూరంలో పులిగడ్డలోని సచివాలయంలో కార్యదర్శి నుంచి గతనెల తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రహదారి సౌకర్యం లేకపోవడంతో పులిగడ్డ ఎలా వెళ్లాలని వారు వాపోతున్నారు. తమ గ్రామంలోనే పింఛన్లు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

కొక్కిలిగడ్డ (మోపిదేవి), న్యూస్‌టుడే: మండలానికి కొత్తగా మంజూరైన 155 పింఛన్లను కొక్కిలిగడ్డలో ఎంపీపీ రావి దుర్గావాణి, జడ్పీటీసీ సభ్యుడు మెడబలిమి మల్లికార్జునరావు, సర్పంచి దిడ్ల జానకిరాంబాబు, ఎంపీటీసీ దిడ్ల రాణి, పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు చందన రంగారావు, కార్యదర్శి వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. ఎంపీడీవో పార్వతి, పలువురు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని