logo

వర్సిటీ పేరు మార్చడం దారుణం : మండలి

ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌గా మార్చారని, ఆ పేరును మార్చడం దారుణమని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు.

Published : 02 Oct 2022 04:06 IST

ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి శిబిరాన్ని ప్రారంభిస్తున్న బుద్ధప్రసాద్‌

అవనిగడ్డ, న్యూస్‌టుడే: ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌గా మార్చారని, ఆ పేరును మార్చడం దారుణమని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. తెదేపా ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట శనివారం నిర్వహించిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి ప్రారంభించి మాట్లాడారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పులిచింతల ప్రాజక్టుకు తన పేరు పెట్టాలని చేసిన ప్రతిపాదనను తిరస్కరించారని చెప్పారు. ఆ తర్వాత కూడా ఆయన పేరుతో ఒక్క ప్రాజక్టుగాని, పథకం గాని పెట్టడానికి ఆయన ఒప్పుకోలేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ పేరు మార్చడంపట్ల రాజశేఖరరెడ్డి ఆత్మ క్షోభిస్తుందన్నారు. మూడేళ్లుగా ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీక్షలో తెదేపా నాయకులు యాసం చిట్టిబాబు, కర్రా సుధాకర్‌, బండే రాఘవ, బొప్పన కాశీవిశ్వేశ్వరరావు, పుల్లగోరు రాజేంద్రరావు, ఎం.ఆదినారాయణ, ఎం.గోపి, బచ్చు రఘునాథప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. వర్షంలో కూడా శిభిరంలోనే కూర్చోవడం విశేషం. శిబిరాన్ని సందర్శించిన వారిలో చల్లపల్లి ఎంపీపీ విజయరాధిక, తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని