logo

సారొస్తున్నారని.. హడావుడిగా మురుగు తొలగింపు

మొవ్వ మండలం కూచిపూడి నుంచి మువ్వన్నెల పతాక రూపకర్త పింగళి వెంకయ్య స్వగ్రామమైన భట్లపెనుమర్రు వెళ్లే ప్రధాన ఆర్‌అండ్‌బీ మార్గంలో గల కూచిపూడి - పెదపూడి వర్తకసంఘం వద్ద రోడ్డుపై వర్షపునీరు నిల్వ ఉంటోంది.

Published : 02 Oct 2022 04:06 IST

రహదారిపై నీటిని తోడుతున్న దృశ్యం

కూచిపూడి, న్యూస్‌టుడే: మొవ్వ మండలం కూచిపూడి నుంచి మువ్వన్నెల పతాక రూపకర్త పింగళి వెంకయ్య స్వగ్రామమైన భట్లపెనుమర్రు వెళ్లే ప్రధాన ఆర్‌అండ్‌బీ మార్గంలో గల కూచిపూడి - పెదపూడి వర్తకసంఘం వద్ద రోడ్డుపై వర్షపునీరు నిల్వ ఉంటోంది. సంఘం కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ చేయూత పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ వస్తుండడంతో కూచిపూడి పంచాయతీ కార్యదర్శి భవాని, నాయకులు కలిసి రహదారిపై గల మురుగునీటిని పంచాయతీ సిబ్బందిచే తొలగించారు. దాంతో తాము నిత్యం మురుగునీటిలో నడుస్తున్నా పట్టించుకోని పంచాయతీ అధికారులు నాయకులొస్తున్నారనే సమాచారంతో హడావుడిగా వాన నీటిని తొలగించడంపై స్థానికులు చెవులు కొరుక్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని