logo

Devineni Uma: బావమరిది అక్రమాలు కనపడవా?: ఎమ్మెల్యే వసంతపై దేవినేని ధ్వజం

కృష్ణా నదిలో ఇసుక, కొండపల్లిలో అక్రమ మైనింగ్‌, మద్యం షాపులు, పేదలకు అందాల్సిన రేషన్‌ను అక్రమ మార్గాన పక్కదోవ పట్టిస్తోంది ‘నీ బావమరిది’ కాదా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను ప్రశ్నించారు.

Updated : 02 Oct 2022 09:31 IST

దీక్షలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఉమా, చిత్రంలో ధారూనాయక్‌, రామకృష్ణ తదితరులు

మైలవరం, జి.కొండూరు, న్యూస్‌టుడే: కృష్ణా నదిలో ఇసుక, కొండపల్లిలో అక్రమ మైనింగ్‌, మద్యం షాపులు, పేదలకు అందాల్సిన రేషన్‌ను అక్రమ మార్గాన పక్కదోవ పట్టిస్తోంది ‘నీ బావమరిది’ కాదా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను ప్రశ్నించారు. శనివారం ఆయన జి.కొండూరులోని తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్‌ పేరు మార్పును వ్యతిరేకిస్తూ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడారు.  వైకాపా ప్రభుత్వ అక్రమాలు, చెత్త నిర్ణయాలను ప్రశ్నించిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించి అరెస్టులు చేయించడం దారుణమన్నారు. చెరువులు ఆక్రమంగా తవ్వుకుంది మీ నాయకులేనని ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. పోలవరానికి పునాదులు వేయలేదంటూ అధికారంలో వచ్చి 40 నెలలైనా ఒక్క పని చేసిన పాపానా పోలేదని, మీ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి నాపై ఆరోపణలు చేయడం చేతగానితనమన్నారు. పైగా తాను చెరువులు, పోలవరం, పట్టిసీమలను దోచేశానంటూ మాయమాటలు చెప్పారని, వారి అక్రమాలను ప్రశ్నించానని తనపై వైకాపా గుండాలతో దాడి చేయించడమే కాకుండా, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించి అరెస్టులు చేశారని మండిపడ్డారు. గడిచిన 40 నెలలు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వానికి 40 ఏళ్ల చరిత్ర కల్గిన తెదేపా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, అరెస్టులు చేసిన బెదిరే ప్రసక్తే లేదన్నారు. వైకాపాను ఓడించడమే లక్ష్యంగా గ్రామాల్లోని తమ నాయకులు, కార్యకర్తలు కసిగా పని చేయాలని కోరారు. నిరసన దీక్ష చేసిన వారిలో తెదేపా రాష్ట్ర పరిశీలకుడు ధారూనాయక్‌, రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ, బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఉయ్యూరు వెంకటనరసింహారావు, చిన నందిగామ సర్పంచి ధనేకుల శ్రీకాంత్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని