logo

ఉత్సాహం.. ఉల్లాసం

సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబించే విధంగా కళాంజలి పట్టుచీరలు ధరించి విద్యార్థినులు నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. శారద కళాశాల ప్రెషర్‌ డే వేడుకలు శనివారం లబ్బీపేటలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో నిర్వహించారు.

Updated : 02 Oct 2022 05:05 IST

కళాంజలి వస్త్రాలతో ప్రదర్శన

ఆకట్టుకున్న ఫ్యాషన్‌ షో

ర్యాంప్‌పై విద్యార్థినుల హొయలు..

లబ్బీపేట (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబించే విధంగా కళాంజలి పట్టుచీరలు ధరించి విద్యార్థినులు నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. శారద కళాశాల ప్రెషర్‌ డే వేడుకలు శనివారం లబ్బీపేటలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాంజలి కంచి, బెనారస్‌, జందాని డిజైన్లు, టర్నింగ్‌ బోర్డర్‌, బ్రైడల్‌, సరికొత్త డిజైన్లలోని పట్టుచీరలను విద్యార్థినులు ధరించి ర్యాంప్‌ వాక్‌ చేసి హోయలొలకించారు. విడివిడిగా, జంటగా, బృందంగా ప్రదర్శనలిస్తూ ఆహూతులకు కనువిందు చేశారు. విద్యార్థులు సంప్రదాయ, శాస్త్రీయ నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ, డాక్టర్‌ ఎ.జి.కె.గోఖలే హాజరయ్యారు. దేశభవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, అందుకు అనుగుణంగా కృషి చేయాలని వారు సూచించారు. కార్యక్రమంలో శారద విద్యాసంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ వై.రమేష్‌బాబు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై.శారదదేవి, సలహాదారు ఈఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, జీఎం జి.వి.రావు, కళాంజలి సీనియర్‌ మేనేజర్‌ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని