logo

‘జాతీయోద్యమాన్ని వక్రీకరిస్తున్న పాలకులు’

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(పీడీఎస్‌వో), నవ యువ సమాఖ్య (పీడీఎస్‌వో-ఎన్‌వైఎస్‌) ప్రచురించిన భారత జాతీయోద్యమం- మహోజ్వల పుస్తకావిష్కరణ సభ శిఖామణి సెంటరు సమీపంలోని శిఖర స్కూల్‌ ఆవరణలో శనివారం నిర్వహించారు.

Published : 02 Oct 2022 04:06 IST

పుస్తకావిష్కరణలో  రవిబాబు, భాస్కర్‌, హనుమంతరావు తదితరులు

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(పీడీఎస్‌వో), నవ యువ సమాఖ్య (పీడీఎస్‌వో-ఎన్‌వైఎస్‌) ప్రచురించిన భారత జాతీయోద్యమం- మహోజ్వల పుస్తకావిష్కరణ సభ శిఖామణి సెంటరు సమీపంలోని శిఖర స్కూల్‌ ఆవరణలో శనివారం నిర్వహించారు. ప్రజాసాహితీ ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆజాదీక అమృత్‌ పేరుతో ఉత్సవాలు చేస్తున్న పాలకులు మరోవైపు జాతీయోద్యమ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. బ్రిటీష్‌ వలసవాద పాలనకు వ్యతిరేకంగా రైతులు, గిరిజనులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువత ప్రాణాలొడ్డి దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారన్నారు. ఓపీడీఆర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.హనుమంతరావు మాట్లాడుతూ... అశేష త్యాగాలతో చేపట్టిన ఉద్యమాల వివరాలతో సంపూర్ణ స్వాతంత్య్రమే ధ్యేయంగా జరిగిన ఉద్యమాల వివరాలు నేడు విదేశీ కంపెనీలు దేశాన్ని దోచుకుంటున్న పరిస్థితులు ఈ పుస్తకంలో వివరించారని పేర్కొన్నారు. పీడీఎస్‌ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి ముందు దేశాన్ని ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఒక్కటే దోచుకుందని, నేడు అనేక విదేశీ కంపెనీలు దోచుకుంటుంటే పాలకులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. పీడీఎస్‌ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.భాస్కర్‌ అధ్యక్ష వహించారు. సభలో ఎన్‌వైఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.బాషా, ఎపీటీఎఫ్‌ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ వర ప్రసాద్‌, జనసాహితీ రాష్ట్ర అధ్యక్షుడు దివికుమార్‌ తదితరులు ప్రసంగించారు. విద్యార్థులు, అభ్యుదయవాదులు, మేధావులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని