logo

ఆంధ్రా ఆసుపత్రి నవజాత శిశువుల ఐసీయూకు గుర్తింపు

ఆంధ్రా హాస్పిటల్స్‌ నవజాత శిశువుల విభాగానికి నేషనల్‌ నియోనాటాలజీ ఫోరమ్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లెవెల్‌ 3బి గుర్తింపు ఇచ్చింది. దేశంలో మొత్తం 8 సెంటర్లు మాత్రమే ఈ గుర్తింపు పొందగా.. రాష్ట్రంలో మొదటిసారిగా ఆంధ్రా హాస్పిటల్స్‌కు ఈ గుర్తింపు వచ్చింది.

Published : 02 Oct 2022 04:06 IST

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : ఆంధ్రా హాస్పిటల్స్‌ నవజాత శిశువుల విభాగానికి నేషనల్‌ నియోనాటాలజీ ఫోరమ్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లెవెల్‌ 3బి గుర్తింపు ఇచ్చింది. దేశంలో మొత్తం 8 సెంటర్లు మాత్రమే ఈ గుర్తింపు పొందగా.. రాష్ట్రంలో మొదటిసారిగా ఆంధ్రా హాస్పిటల్స్‌కు ఈ గుర్తింపు వచ్చింది. అత్యంత ఆధునిక పరికరాలు, నేర్పు, అనుభవం కలిగిన వైద్యులు, సిబ్బంది, నవజాత శిశువుల శస్త్రచికిత్సలు, గుండె శస్త్రచికిత్సలు ఎక్కవ శాతం విజయవంతంకావడం తదితర అంశాల ప్రాతిపదికగా ఈ గుర్తింపు ఇస్తారు. లెవెల్‌ 3బి గుర్తింపు రావడంపై ఆంధ్రా హాస్పిటల్స్‌ నవజాత శిశువుల, పిల్లల వైద్య బృందానికి, నర్సులకు ఆంధ్రా హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ పి.వి.రమణమూర్తి, డైరెక్టర్‌ డాక్టర్‌ పి.వి.రామారావులు కృతజ్ఞతలు తెలియజేశారు. 23 సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేయటం వల్లే ఇది సాధ్యపడిందని వారు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని