logo

బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో కలిసి హెచ్‌ఎంలను సమన్వయం చేసుకుని పాఠశాలల్లో చేర్పించాలన్నారు.

Published : 02 Oct 2022 04:06 IST

మచిలీపట్నం కార్పొరేషన్‌: బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో కలిసి హెచ్‌ఎంలను సమన్వయం చేసుకుని పాఠశాలల్లో చేర్పించాలన్నారు. జిల్లాలో 5,410మంది పిల్లలు బడి మానేసినట్లు గుర్తించామని, వారి వివరాలు మండలాల వారీగా ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు పంపించామన్నారు. వారందరినీ బడిలోనే చేరేలా చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని