logo

హక్కు పత్రాల పంపిణీ వాయిదా

జగనన్న భూరక్ష-శాశ్వత భూహక్కు కార్యక్రమం ద్వారా భూముల సమగ్ర సర్వే తర్వాత రైతులకు అందజేసే హక్కు పత్రాల పంపిణీ వాయిదా పడినట్లు సమాచారం.

Published : 02 Oct 2022 04:06 IST

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే : జగనన్న భూరక్ష-శాశ్వత భూహక్కు కార్యక్రమం ద్వారా భూముల సమగ్ర సర్వే తర్వాత రైతులకు అందజేసే హక్కు పత్రాల పంపిణీ వాయిదా పడినట్లు సమాచారం. వాస్తవానికి ఆదివారం గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో సర్వే పూర్తయిన 41 గ్రామాల్లో పంపిణీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆర్వోఆర్‌లు సిద్ధం కాకపోవడంతో కనీసం మండలానికి ఒక గ్రామంలోనైనా లాంఛనంగా కార్యక్రమం ప్రారంభించాలని భావించారు. వివిధ కారణాలతో ఇది కూడా వాయిదా పడింది. ఈ నెల రెండో వారం తర్వాత సీఎం చేతుల మీదుగా పంపిణీ ప్రారంభిస్తారని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని