logo

రక్తదానంతో మరొకరికి పునర్జన్మ

రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయంలో మరొకరి ప్రాణాలను కాపాడుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ పేర్కొన్నారు. ఆదివారం

Published : 03 Oct 2022 05:46 IST

శిబిరాన్ని పరిశీలిస్తున్న జస్టిస్‌ బట్టు దేవానంద్‌. చిత్రంలో అజయ్‌కుమార్‌, శాంతిశ్రీ, రవీంద్ర తదితరులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయంలో మరొకరి ప్రాణాలను కాపాడుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ పేర్కొన్నారు. ఆదివారం బీసెంటురోడ్డులోని దున్నా వారి వీధిలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ జూబ్లీ హరిత ఆధ్వర్యంలో గాంధీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జస్టిస్‌ దేవానంద్‌ ప్రారంభించి, మాట్లాడారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం పునర్జన్మ ఇస్తుందని తెలిపారు. ప్రాణదాతలుగా మారిన యువకులను ఆయన అభినందించారు. ఇప్పటికే 500 యూనిట్ల రక్తదానం చేసిన లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ జూబ్లీ హరిత సభ్యులను అభినందించారు. పేదలకు దుప్పట్లు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తున్న లయన్స్‌ క్లబ్‌ సభ్యుల సేవా కార్యక్రమాలపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలో పెద్దదైన సామాజిక సేవా సంస్థ లయన్స్‌ క్లబ్బులు మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దీనికి ముందు మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు దుప్పట్లు, భోజన ప్యాకెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ జిల్లా గవర్నర్‌ దామర్ల శాంతిశ్రీ, లయన్స్‌ క్లబ్‌ విజయవాడ జూబ్లీ హరిత ఛైర్మన్‌ చలసాని అజయ్‌కుమార్‌, అధ్యక్షుడు బొజ్జా రవీంద్ర, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని