logo

‘తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు

నగరానికి చెందిన యాసర్ల సాత్విక్‌(8) గుంజీలు (సిట్‌-అప్స్‌)తీయడంలో ‘తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ నమోదు చేశాడు. 37 నిమిషాల వ్యవధిలో 1200 సిట్‌-అప్స్‌ చేసి ఈ ఘనత సాధించాడు.

Updated : 04 Oct 2022 05:41 IST

ధ్రువ పత్రం, జ్ఞాపిక, పతకంతో సాత్విక్‌

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: నగరానికి చెందిన యాసర్ల సాత్విక్‌(8) గుంజీలు (సిట్‌-అప్స్‌)తీయడంలో ‘తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ నమోదు చేశాడు. 37 నిమిషాల వ్యవధిలో 1200 సిట్‌-అప్స్‌ చేసి ఈ ఘనత సాధించాడు. ఈ ఏడాది జులై 30వ తేదీన ఆన్‌లైన్‌లో ‘తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ సంస్థ ప్రతినిధుల పర్యవేక్షణలో.. సాత్విక్‌ చేసిన ప్రదర్శనను ధ్రువీకరిస్తూ ఇటీవల ధ్రువ పత్రం, పతకం, జ్ఞాపికను కొరియర్‌ ద్వారా ఆ సంస్థ పంపినట్లు బాలుడి తండ్రి శ్రీహరి తెలిపారు. తండ్రి పోలీసు శాఖ సీఐడీ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తల్లి పుష్పలత గృహిణి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు శిక్షకుడు యు.శ్రీనివాసరావు తర్ఫీదుతో విజయం సాధించానని చిన్నారి తెలిపాడు. ప్రస్తుతం నగరంలోని శ్రీచైతన్య స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని