logo

ఏఎస్‌డబ్ల్యూవో అరెస్టుకు డిమాండ్‌

నున్న సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతిగృహ వార్డెన్‌ పైడిపాముల లక్ష్మిని కులం పేరుతో దూషించి, చేయిచేసుకున్న విజయవాడ ఇన్‌ఛార్జి సాంఘిక సంక్షేమశాఖ సహాయ సంక్షేమాధికారి (ఏఎస్‌డబ్ల్యువో) గోపాలకృష్ణను, అతనికి సహకరించిన వంట మనిషి టి.నాగేశ్వరిలను అరెస్టు చేయాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.

Published : 05 Oct 2022 01:49 IST

రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌కు వినతిపత్రం అందిస్తున్న కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి, నాయకులు

నున్న(విజయవాడ గ్రామీణం), న్యూస్‌టుడే: నున్న సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతిగృహ వార్డెన్‌ పైడిపాముల లక్ష్మిని కులం పేరుతో దూషించి, చేయిచేసుకున్న విజయవాడ ఇన్‌ఛార్జి సాంఘిక సంక్షేమశాఖ సహాయ సంక్షేమాధికారి (ఏఎస్‌డబ్ల్యువో) గోపాలకృష్ణను, అతనికి సహకరించిన వంట మనిషి టి.నాగేశ్వరిలను అరెస్టు చేయాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. జరిగిన ఘటనపై కేవీపీఎస్‌ ప్రజా సంఘాల నాయకులతో కలసి తాము విచారణ జరిపినట్టు పేర్కొన్నారు. వంట మనిషి నాగేశ్వరి సకాలంలో విధులకు రావడం లేదని, విద్యార్థులకు పనులు చెబుతోందని, వసతిగృహ అధికారి లక్ష్మిని ఇబ్బందులకు గురిచేసినట్టు పేర్కొన్నారు. ఆగస్టు 7న ఆమెపై వార్డెన్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారని, ఆ రోజు సాయంత్రం విచారణ పేరుతో వసతిగృహం వద్దకు వచ్చిన ఏఎస్‌డబ్ల్యువో గోపాలకృష్ణ వంట మనిషికి అనుకూలంగా మాట్లాడుతూ లక్ష్మిని దుర్భాషలాడుతూ దాడి చేశారన్నారు. పోలీసులకు ఆమె దీనిపై ఫిర్యాదు చేయగా, ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందన్నారు. దీనిపై ఏసీపీ విచారణ జరిపినా ఏఎస్‌డబ్ల్యువోను అరెస్టు చేయలేదన్నారు. పైగా లక్ష్మీపై వేధింపులు పెరిగాయని, ఆమెను నున్న నుంచి మరో చోటుకు బదిలీ చేశారన్నారు. ఈ క్రమంలో ఎస్సీ కమిషన్‌ పరంగానూ సమగ్ర విచారణ చేసి ఏఎస్‌డబ్ల్యువో, వంట మనిషిలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, లక్ష్మీకి తిరిగి నున్నలోనే పోస్టింగ్‌ ఇవ్వాలని ఆ వినతిపత్రంలో మాల్యాద్రి కోరారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని