logo

సాంకేతికత తోడైతే వ్యవసాయం పండగే: డాక్టర్‌ రత్తయ్య

వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఆధునిక సాంకేతికత తోడైతే అద్భుతాలు సాకారమవుతాయని విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధ్యక్షుడు డాక్టర్‌ లావు రత్తయ్య అన్నారు. గతానికి భిన్నంగా వ్యవసాయం కూడా కార్పొరేట్‌ తరహాలో చేయడం నేటి యువత అలవర్చుకోవడం అభినందనీయమన్నారు.

Published : 05 Oct 2022 01:49 IST

నూతన యూనిట్‌ని ప్రారంభిస్తున్న లావు రత్తయ్య, రమేష్‌, పవన్‌

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఆధునిక సాంకేతికత తోడైతే అద్భుతాలు సాకారమవుతాయని విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధ్యక్షుడు డాక్టర్‌ లావు రత్తయ్య అన్నారు. గతానికి భిన్నంగా వ్యవసాయం కూడా కార్పొరేట్‌ తరహాలో చేయడం నేటి యువత అలవర్చుకోవడం అభినందనీయమన్నారు. ఆక్వా సాగుదార్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించి, లాభసాటిగా మార్చే ఉద్దేశంతో వీరవల్లిలో ఆక్వా ఎక్స్ఛేంజి, నెక్స్ట్‌ ఆక్వా సంస్థలు సంయుక్తంగా ఓ యూనిట్‌ని నెలకొల్పాయి. వీరు రూపొందించిన పరికరం సాయంతో రైతులు, తమ చెరువుల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నచోట నుంచే చరవాణిలో పర్యవేక్షించే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. రైతుల్ని అప్రమత్తం చేసేలా ఈ యూనిట్‌లో కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌, కాల్‌ సెంటరు కూడా ఏర్పాటు చేశారు. దీన్ని రత్తయ్య రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించగా, ఆక్వా రంగంలో ఇది విప్లవాత్మకమని ఇందులో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. ఇందులో మెడ్విన్‌ ఆసుపత్రుల పూర్వ ఎండీ రమేష్‌, యూనిట్‌ నిర్వాహకులు పవన్‌, కిరణ్‌, కరీం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని