logo

ముగిసిన వేదపండిత పరీక్షలు

వేదపండిత పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి విజయ దశమి రోజున ధ్రువపత్రాలు అందజేస్తామని ప్రముఖ ఘనాపాటి విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ తెలిపారు.

Published : 05 Oct 2022 01:49 IST

సభలో పాల్గొన్న వేదపండితులు

సత్యనారాయణపురం, న్యూస్‌టుడే : వేదపండిత పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి విజయ దశమి రోజున ధ్రువపత్రాలు అందజేస్తామని ప్రముఖ ఘనాపాటి విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ తెలిపారు. స్వధర్మ స్వరాజ్య సంఘం ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలోని లలితామణి కల్యాణ మండపంలో గత నాలుగు రోజులుగా వేదపరీక్షలు నిర్వహిస్తున్నారు. తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి 45మంది వేద విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ఆహితాగ్ని సభ నిర్వహించారు. ప్రముఖ ఘనపాటి విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ, విష్ణుభొట్ల సుబ్రహ్మణ్యశర్మలు.. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వేదంతోపాటు వేదార్థములో పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రం అందజేస్తామని నిర్వాహకులు లక్ష్మీమణి తెలిపారు. దీనికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. తమ కుటుంబం వంశపారంపర్యంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఏటా ఆహితాగ్ని సభ, విజయదశమి నాడు వేదపండిత సభ నిర్వహించి పండితుల్ని సత్కరిస్తున్నట్లు వివరించారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts