logo
Published : 05 Oct 2022 01:49 IST

‘మూడు రాజధానులతో అన్ని ప్రాంతాల అభివృద్ధి’

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులను కోరుకుంటున్నారని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. విజయవాడ నుంచి శ్రీశైలం వెళుతూ గుంటూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కొద్దిసేపు మంగళవారం విడిది చేశారు. విలేకరులతో మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని, మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాజధానికి కోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. విజయవాడలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. గత 9 రోజులుగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవటానికి లక్షల మంది భక్తులు వచ్చారన్నారు. గతంలో లక్షల సంఖ్యలో భక్తులు ఎప్పుడూ రాలేదని, అమ్మవారి దర్శనానికి చేసిన ఏర్పాట్లతో దర్శనం బాగా జరిగిందని సామాన్య భక్తులు చెపుతున్నారన్నారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని