kodali nani: హైదరాబాద్‌ను కోల్పోయిన మనకు మళ్లీ ఆ పరిస్థితి రావొద్దు: కొడాలి నాని

రెక్కాడితే గాని, డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల కోసమే ముఖ్యమంత్రి జగన్‌  3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

Published : 06 Oct 2022 01:47 IST

గుడ్లవల్లేరు: రెక్కాడితే గాని, డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల కోసమే ముఖ్యమంత్రి జగన్‌  3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 3 రాజధానులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కాంక్షిస్తూ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి ఉద్యమాన్ని దేవుళ్లు, ప్రజలు హర్షించరని  వ్యాఖ్యానించారు. కులాలు, పార్టీల కోసమో కాక, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేయకూడదనే  సీఎం జగన్‌ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్ర సంపద అంతా ఒకే చోట పెడితే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌ను కోల్పోయి అనాథలమయ్యామని, శ్రమంతా అమరావతికే పెడితే తిరిగి అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని కొడాలి నాని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని