logo

భవానీ.. వెళ్లొస్తాం..

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు ముగిశాయి. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబరు 5 వరకూ వేడుకలు జరిగాయి.

Updated : 07 Oct 2022 05:11 IST

ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా శరన్నవరాత్రులు

రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు ముగిశాయి. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబరు 5 వరకూ వేడుకలు జరిగాయి. ఆరంభంలో రోజుకు 50వేల మంది వరకూ భక్తులు తరలివచ్చారు. ఐదో రోజు శుక్రవారం నుంచి భక్తుల రద్దీ పెరిగింది. అక్టోబరు 2న మూలా నక్షత్రం రోజున అర్థరాత్రి ఒంటిగంట నుంచి దర్శనాలకు అనుమతించారు. దీంతో ఒకేరోజులో రెండున్నర లక్షల మంది వరకూ భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత నుంచి విజయ దశమి వరకూ భక్తుల రద్దీ తగ్గలేదు. రోజుకు ఒకటిన్నర నుంచి రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల చివరి రోజు కూడా భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. చివరి రోజు నుంచి భవానీభక్తుల రాక ఎక్కువైంది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది భారీగా భక్తులు తరలివస్తారని అంచనా వేసినట్టుగానే.. 12లక్షల మందికి పైగా తరలివచ్చారు. దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత గురు, శుక్రవారాల్లోనూ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి రూపంలోనే భక్తులకు దర్శనమిస్తారు. ఈ రెండు రోజుల్లో మరో నాలుగు లక్షల మంది వరకూ భక్తులు తరలివస్తారని అంచనా. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు ఆధ్వర్యంలో పోలీసు కమిషనర్‌ కాంతిరాణా, ఆలయ ఈవో భ్రమరాంబ ఉత్సవాలను పర్యవేక్షిస్తూ.. ఎప్పటికప్పుడు ఎదురైన సమస్యలను కొంతవరకూ పరిష్కరిస్తూ వెళ్లారు. అయినప్పటికీ ఈ ఏడాది దసరా ఉత్సవాల నిర్వహణలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. రద్దీ అధికంగా ఉన్న రోజుల్లో సాధారణ భక్తుల దర్శనాలకు ఆరేడు గంటలకు పైగా సమయం పట్టింది.  

- ఈనాడు, అమరావతి

ఇంద్రకీలాద్రి దిగువన భవానీలతో కిక్కిరిసిన అర్జునవీధి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని