logo

Jagananna Colony: అంధకారంలో జగనన్న కాలనీ వాసులు

జగనన్న కాలనీలలో సొంత ఇంటి నిర్మాణం పూర్తిచేసుకుని దిగిన వారికి సరైన సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు.

Updated : 20 Oct 2022 08:54 IST

ఈనాడు అమరావతి: జగనన్న కాలనీలలో సొంత ఇంటి నిర్మాణం పూర్తిచేసుకుని దిగిన వారికి సరైన సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. సొంత ఇంటి నిర్మాణం కోసం బయట వడ్డీలకు అప్పులు తెచ్చుకుని మరీ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకుని, బయట అద్దెలు భరించలేక  ఇక్కడికి వచ్చిన వారికి ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. కొంతమంది ఇళ్లల్లో ఉండలేక తాళాలు వేసుకుని మళ్లీ అద్దె ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో  లేఔట్‌లో మొత్తం 1605 గృహనిర్మాణాలకు గాను ఇప్పటికే 60 శాతం పూర్తయినా కనీసం మంచినీరు, రోడ్డు, విద్యుత్‌, డ్రైనేజీ సౌకర్యం కూడా లేకపోవడంతో ఎవరూ ఇళ్లలోకి రాలేని పరిస్థితి. విద్యుత్తు స్తంభాలు వేసినా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇళ్లకు  విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో నిర్మాణం పూర్తిచేసుకుని తప్పని పరిస్థితుల్లో  కాపురాలు ఉంటున్న 55 గృహాలవారికి ఒకే విద్యుత్తు స్తంభం నుంచి  వైర్లు వేసి కనెక్షను ఇస్తున్నారు. కాపురం ఉన్న ఇంటికి తప్పితే చుట్ట పక్కల ఎక్కడా కనీసం విద్యుత్‌దీపాలు లేక అంధకారం అలుముకుంటుంది. రాత్రి వేళ దొంగలు,పాముల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే  బురద, సెల్‌ఫోన్‌ వెలుతుర్లే దిక్కు. రాత్రి వేళ చీకట్లో నిర్మాణ సామగ్రి అంతా దొంగలు ఎత్తుకెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట అద్దెలు కట్టలేక, కట్టుకున్న ఇంట్లో ఉండలేక అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు.

బురదమయంగా వీధులు.. నీటి పాలవుతున్న నిర్మాణ సామగ్రి, ఇసుక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు