logo

కోడి కత్తుల తయారీ కేంద్రాలపై దాడి

విస్సన్నపేట బస్టాండు, పంచాయతీ కార్యాలయం వెనుక వీధుల్లో కొడవళ్లు, గొడ్డళ్ల మాటున కోడి కత్తులు తయారు చేస్తున్నారనే సమాచారంతో సీఐ ఆర్‌.భీమరాజు, ఎస్సై కిశోర్‌ ఆధ్వర్యంలో రెండు బృందాలు గురువారం ఆకస్మిక దాడులు చేశారు.

Updated : 25 Nov 2022 05:37 IST

ఏడుగురు నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ రమేశ్‌

తిరువూరు: విస్సన్నపేట బస్టాండు, పంచాయతీ కార్యాలయం వెనుక వీధుల్లో కొడవళ్లు, గొడ్డళ్ల మాటున కోడి కత్తులు తయారు చేస్తున్నారనే సమాచారంతో సీఐ ఆర్‌.భీమరాజు, ఎస్సై కిశోర్‌ ఆధ్వర్యంలో రెండు బృందాలు గురువారం ఆకస్మిక దాడులు చేశారు. ఈక్రమంలో కోడి పందేలకు వినియోగించే కత్తులు తయారు చేస్తున్న విస్సన్నపేటకు చెందిన నడకుదురు చంద్రశేఖర్‌, నడకుదురు పవన్‌, గవలపల్లి రాంబాబు, నడకుదురు సర్వేశ్వరరావు, నడకుదురు భూషణం, ముతరాశిపాలెం గ్రామవాసి కోట వెంకటరత్నం, రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేటకు చెందిన కొనకాల వెంకటేశ్వరరావును అదుపులో తీసుకున్నారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన ఐదు యంత్రాలు, 2,300 కత్తులు స్వాధీనం చేసుకున్న పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఎం.రమేశ్‌ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా కోడికత్తులు తయారు చేస్తున్నందుకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రానున్న సంక్రాంతి పర్వదినం సందర్భంగా కోడి పందేలను నిలువరించే దిశగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని