logo

కరెంటు నిలిపేశారంటూ సర్పంచి కన్నీళ్లు

తన ఇంటికి కరెంటు కట్‌ చేశారంటూ ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేలకు చెందిన వైకాపా దళిత సర్పంచి కారుమంచి స్వాతి మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో కన్నీరుమున్నీరుగా విలపించడం చర్చనీయాంశమైంది.

Updated : 26 Nov 2022 06:18 IST

రోదిస్తున్న స్వాతి

తిరువూరు, న్యూస్‌టుడే: తన ఇంటికి కరెంటు కట్‌ చేశారంటూ ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేలకు చెందిన వైకాపా దళిత సర్పంచి కారుమంచి స్వాతి మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో కన్నీరుమున్నీరుగా విలపించడం చర్చనీయాంశమైంది. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ పి.మెర్సీ వనజాక్షి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో పుట్రేల సర్పంచి స్వాతి డిస్కం అధికారుల తీరును ప్రస్తావిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. నాలుగు నెలల బిల్లు ఒక్కసారే తీయడం వల్ల ఎక్కువగా వచ్చిందని, ఇటీవల తనిఖీల పేరిట వచ్చిన అధికారులు కరెంట్‌ కట్‌ చేశారని, తాము ఓసీ కాదని, ఎస్సీ సామాజిక వర్గమని చెప్పినా వినిపించుకోలేదని విలపించారు. దీంతో సభ్యులతో పాటు ఎంపీపీ వనజాక్షి, ఎంపీడీవో వెంకటరమణ డిస్కం ఏఈ విజయభాస్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ చేసే సమయంలో చెప్పేది వినరా..? అన్ని ప్రశ్నించారు. ప్రత్యేక బృందాల తనిఖీ సందర్భంగా జరిగిన పొరపాటును సరి చేస్తామని ఏఈ వివరణ ఇవ్వడంతో వివాదం ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని