logo

వైకాపా నియంతృత్వ పాలన తరిమికొడదాం : దేవినేని

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, దానిని తరిమికొడదామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.

Published : 27 Nov 2022 05:12 IST

జి.కొండూరులో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం
అందజేస్తున్న ఉమా, రవికుమార్‌ తదితరులు

జి.కొండూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, దానిని తరిమికొడదామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. జి.కొండూరులో శనివారం ఆయన నిరసన ప్రదర్శనలో పాల్గొని స్థానిక సినిమా హాల్‌ సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పాలనలో ప్రతిపక్షాలనే కాకుండా మీడియా, న్యాయమూర్తులపై ఆరోపణలు చేసే స్థితికి వైకాపా నాయకులు తెగించారన్నారు. దళితులు, మహిళలపై హత్యాయత్నాలు, శిరోముండనాలు, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా.. దానిని అమలు చేసే నాయకుడు చెడ్డవాడైతే అది చెడ్డ ఫలితాన్నిస్తుందన్నారు. నేటి వైకాపా పాలనే దీనికి నిదర్శనమన్నారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన కొనసాగుతుందని, నేడు దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేసి, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాన్ని నేడు ఇలా మార్చడంతో ప్రజలంతా ‘ఇదేం ఖర్మ.. ఇదేం ప్రభుత్వం’ అని అలోచన చేయాలన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు డిసెంబరు నెల మొత్తం ప్రతి గ్రామంలో నాయకులందరితో కలిసి ‘ఇదేం ఖర్మ.. ఇదేం ప్రభుత్వం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ, ఉయ్యూరు వెంకటనరసింహారావు, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు పజ్జూరు రవికుమార్‌, లంకా రామకృష్ణ, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని