logo

రీసర్వే లోపాల దిద్దుబాటుకు చర్యలు

జగనన్న భూరక్ష-శాశ్వత భూహక్కు పథకం ద్వారా చేపట్టిన సమగ్ర భూసర్వేలో బాపులపాడు మండలం రంగన్నగూడెంలో జరిగిన లోపాలు, దొర్లిన తప్పులను సరిదిద్దేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

Published : 27 Nov 2022 05:20 IST

సర్వే నిర్వహిస్తున్న దృశ్యం

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: జగనన్న భూరక్ష-శాశ్వత భూహక్కు పథకం ద్వారా చేపట్టిన సమగ్ర భూసర్వేలో బాపులపాడు మండలం రంగన్నగూడెంలో జరిగిన లోపాలు, దొర్లిన తప్పులను సరిదిద్దేందుకు అధికారులు రంగంలోకి దిగారు. సకాలంలో9(2) నోటీసులు జారీ చేయకపోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో ఉన్న వివరాలకు, సర్వేలో నమోదు చేసిన వివరాలకు పొంతన లేక రైతులు ఆందోళనకు గురవుతున్న వైనంపై ఈనెల 24న’ బాబోయ్‌ ఇదేమీ కిరికిరీ సర్వే’ పేరుతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే లోపాలను సరిచేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సర్వే ఏడీ గోపాల్‌, మండల, గ్రామ సర్వేయర్లు రంగారావు, సుష్మ, వీఆర్వో తేరేజమ్మ ఆధ్వర్యంలోని బృందం శనివారం గ్రామంలో పర్యటించి, ఇప్పటికే ఫిర్యాదులు చేసిన రైతుల పొలాలను సందర్శించడంతో పాటు, గ్రామానికి సంబంధించిన సర్వే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని కచ్చితమైన వివరాలు నమోదయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని