రైతులకు నష్టపరిహారం ఇవ్వకుంటే ఉద్యమం: జనసేన
పంపుల చెరువు గండి వల్ల నష్ట పోయిన 60 ఎకరాల రైతులకు ఏడాది నుంచి నష్ట పరిహారం ఇవ్వక పోగా పాడైన చెరువు కట్టను బాగు చేయకపోవడం దారుణమంటూ ఆందోళనకు దిగిన జనసేన నాయకుల్ని గుడివాడ టూటౌన్ సీఐ బి.తులసీధర్ అరెస్టు చేసి శనివారం కేసులు నమోదు చేశారు.
పంపుల చెరువు వద్ద నిరసన తెలియజేస్తున్న జనసైనికులు
నెహ్రూచౌక్(గుడివాడ), గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: పంపుల చెరువు గండి వల్ల నష్ట పోయిన 60 ఎకరాల రైతులకు ఏడాది నుంచి నష్ట పరిహారం ఇవ్వక పోగా పాడైన చెరువు కట్టను బాగు చేయకపోవడం దారుణమంటూ ఆందోళనకు దిగిన జనసేన నాయకుల్ని గుడివాడ టూటౌన్ సీఐ బి.తులసీధర్ అరెస్టు చేసి శనివారం కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం గుడివాడ పట్టణం పెద ఎరుకపాడులోని పంపుల చెరువుకు గత జనవరి 21న గండి పడి 60 ఎకరాల పంట మునిగిపోయింది. నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలంటూ 10 మంది బాధితులతో కలిసి జనసేన నాయకులు చెరువు ప్రాంతంలోకి వెళ్లి ఆందోళనకు దిగారు. దీంతో మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్ ఆదేశాలతో మున్సిపల్ వాటర్ వర్క్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిషేధిత ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు జనసేన నియోజకవర్గ బాధ్యుడు బూరగడ్డ శ్రీకాంత్, నాయకులు కొదమల గంగాధరరావు, శాయన రాజేష్, వడ్డాది శ్రీనివాస లక్ష్మీకాంత్, వేమూరి త్రినాథ్, మజ్జి శ్రీను, జేమ్స్‌పై కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. అనంతరం బెయిలుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తూ నష్ట పరిహారం ఇవ్వకుండా తాత్సారం చేస్తుంటే రైతులకు మద్దతుగా ఆందోళన చేయడం తప్పా అని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అధికారుల తీరుకు నిరసనగా స్టేషన్ వద్ద నినాదాలు చేశారు. ప్రజలకు రెండు పూటలా తాగునీరు అందించాలని.. చేతకాకపోతే ప్రజాప్రతినిధులు పదవుల నుంచి తప్పుకోవాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Modi: బడ్జెట్ సమావేశాలకు ముందే.. ప్రపంచం నుంచి సానుకూల సందేశాలు..!
-
India News
Vistara: విమాన ప్రయాణికురాలి వీరంగం.. సిబ్బందిని కొట్టి, అర్ధ నగ్నంగా తిరిగి..!
-
Sports News
Womens U19 Team: బుధవారం సచిన్ చేతుల మీదుగా అండర్-19 వరల్డ్‌కప్ విజేతలకు సత్కారం
-
India News
Congress: రాష్ట్రపతి ప్రసంగానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం.. మంచు కారణమట..!
-
Movies News
Chiranjeevi: ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
-
World News
Imran khan: ఇమ్రాన్ సంచలన నిర్ణయం.. 33 ఎంపీ స్థానాల్లో ఒక్కడే పోటీ