logo

గంజాయి స్మగ్లర్ల అరెస్టు

గంజాయి విక్రయిస్తూ యువత జీవితాన్ని నాశనం చేస్తున్న స్మగ్లర్లపై గుడివాడ టూటౌన్‌ పోలీసులు నిఘా పెట్టి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎన్‌.సత్యానందం తెలిపారు.

Published : 27 Nov 2022 05:20 IST

పది కిలోల సరకు, ద్విచక్ర వాహనం, చరవాణులు స్వాధీనం

గంజాయితో పట్టుబడిన యువకులు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గంజాయి విక్రయిస్తూ యువత జీవితాన్ని నాశనం చేస్తున్న స్మగ్లర్లపై గుడివాడ టూటౌన్‌ పోలీసులు నిఘా పెట్టి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎన్‌.సత్యానందం తెలిపారు. స్థానిక టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు టూటౌన్‌ సీఐ బి.తులసీధర్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు ఎన్‌.మురళీ కృష్ణ, పూడి నాగరాజు, సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి స్టేషన్‌ పరిధిలో నిఘా పెంచారు. గంజాయి విక్రేతలు రైల్వే స్టేషన్‌ వద్ద ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి బాపులపాడు మండలం అంపాపురానికి చెందిన తుపాకుల నాగరాజు, వీరవల్లి ఆర్బిట్‌ కాలనీకి చెందిన వెలిసెల వెంకటేశ్వరరావు, గుడివాడ వాంబే కాలనీకి చెందిన నాయక్‌ ప్రతాప్‌ అలియాస్‌ బుడ్డ ప్రతాప్‌, గుడివాడ రైలుపేటకు చెందిన కట్టా ప్రభుకుమార్‌ను అరెస్టు చేశారన్నారు. వారి నుంచి ఒక ద్విచక్ర వాహనం, మూడు చరవాణులు, 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సంవత్సరం గుడివాడ డివిజన్‌లో ఆరు గంజాయి కేసులు నమోదయ్యాయన్నారు. స్మగ్లర్లను అరెస్టు చేసినందుకు టూటౌన్‌ సీఐ, ఎస్‌ఐలతోపాటు, ఏఎస్‌ఐ ప్రకాష్‌, పీసీలు బాలకృష్ణ, కుమార స్వామిని సత్యానందం అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని