logo

Andhra News: దారి చూపించారు.. రూ. లక్ష గెలిచారు

కం టిచూపు లేని వారికి దారి చూపే కర్ర ఇది.. రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఏదైనా వాహనం కాని, జంతువు కాని ఎదురొచ్చిన వెంటనే  చేతిలో ఉన్న కర్రకు అమర్చిన సెన్సర్స్‌  వెంటనే అప్రమత్తం చేస్తాయి.

Published : 27 Nov 2022 08:59 IST

కం టిచూపు లేని వారికి దారి చూపే కర్ర ఇది.. రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఏదైనా వాహనం కాని, జంతువు కాని ఎదురొచ్చిన వెంటనే  చేతిలో ఉన్న కర్రకు అమర్చిన సెన్సర్స్‌  వెంటనే అప్రమత్తం చేస్తాయి. చేతి కర్ర నుంచి బీప్‌ సౌండ్స్‌ వస్తాయి. ప్రమాదం పొంచి ఉందని అంధుడు గుర్తిస్తే స్టిక్‌లో ఉన్న ప్యానిక్‌ బటన్‌ నొక్కితే అతని బంధువుల ఫోన్‌కు పొట్టిసందేశం, ప్రదేశం వివరాలు వెళ్తాయి. త్వరలోనే ఇదే ప్యానిక్‌ బటన్‌ని అభివృద్ధి చేసి పోలీసులకు  సైతం సమాచారం వెళ్లేలా రూపొందిస్తున్నట్లు దీన్ని తయారుచేసిన అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు.

పి.సాయిసాహిత్‌, ఎన్‌.ఉదయ్‌కిరణ్‌, ఎం.పవన్‌కుమార్‌లు తెలిపారు..రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో  విజయవాడలో మూడురోజుల పాటు  నిర్వహించిన పాలిటెక్‌ ఫెస్ట్‌-2022లో ప్రదర్శించిన 253 ప్రాజెక్టులలో ఈ స్మార్ట్‌ బ్లైండ్‌ స్టిక్‌ ప్రదర్శనకు మొదటిబహుమతి పాటు, లక్షరూపాయల నగదు బహుమతి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని